ఆదిత్య ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం

UPDATED 2nd MAY 2018 WEDNESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం బుధవారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. కాకినాడ త్రివేణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ సుజయ్ లు దంత సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరిస్తూ మనిషికి దంతాలు ఎంతో ప్రాముఖ్యమని, దంతాల పరిశుభ్రతపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, ప్రతీ నెల తప్పనిసరిగా దంత పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థలలో పనిచేస్తున్న బస్సు డ్రైవర్లు, క్లీనర్లు,  సిబ్బందికి దంత పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలను అందించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్. కో-ఆర్డినేటర్, ఎం. సోమిరెడ్డి, ఆదిత్య రవాణా నిర్వహణ అధికారులు కె. శ్రీరామచంద్రమూర్తి (చిట్టిబాబు) సి.హెచ్. వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

ads