ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలి

Updated 27th April 2017 Thursday 10:00 AM

పెద్దాపురం: వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను  పరిష్కరించాలని పెద్దాపురం వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ రమణమూర్తి పేర్కొన్నారు. స్థానిక వరహాలయ్యపేట లోని యాసలపు సూర్యారావు భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమను ప్రభుత్వం గుర్తించి పలు సౌకర్యాలను కల్పించాలన్నారు. అలాగే వృత్తినే నమ్ముకుని వృద్ధాప్యం బారిన పడ్డ ఫోటోగ్రాఫర్లకు పెన్షన్ పథకం అమలు చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు వర్తించే అన్ని పథకాలు అమలు చేయాలని  బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో కూడిన రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ సుంకు లోవరెడ్డి, జిల్లా సభ్యుడు దేశపల్లి వరహాలరాజు, సభ్యులు తమ్మన ఆనంద్, ప్రకాష్, చిన్ని, విజయ్, ఈశ్వరరావు, వీరబాబు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us