ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

UPDATED 29th APRIL 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: ప్రజావాణికి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో గిరిజనులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కోసం, అలాగే ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉన్న కొబ్బరిచెట్టు తమ ఇంటి పైకి వస్తుందని వాటిని తొలగించాలని అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో  తెలిపారు. ఈ తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads