వకీల్ సాబ్ డేట్ ఫిక్స్

(రెడ్ బీ న్యూస్):ఈ ఏడాదే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడాలనుకున్న అభిమానుల ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న `వకీల్‌ సాబ్` సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. బుధవారమే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగు పెట్టింది. తాజా సమాచారం ప్రకారం `వకీల్ సాబ్` సినిమాను వేసవి సందర్భంగా ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. సంక్రాంతికి `వకీల్ సాబ్` టీజర్‌ను విడుదల చేస్తారట. ఆ టీజర్‌తో పాటే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారట.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us