ప్రగతిలో డిజిటల్ లావాదేవీలపై అవహగాహనా సదస్సు

UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో కాకినాడ జెఎన్టీయుకె ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 32 మంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికార్లకు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సిస్టం, ఈజీ ట్రాన్సక్షన్స్ అనే అంశంపై అవగాహనా సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎఫ్ఎంఎస్ సాఫ్ట్ వేర్, డిజిటల్ లావాదేవీలు, ఆధార్, పాన్ లను బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎన్ఎస్ఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ విభాగంలో భాగంగా ఉండడం వల్ల వారిలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే నేటి కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విభాగంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ స్పెషన్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సిస్టం విజయవాడకు చెందిన ఎ.వి.ఎన్.రావు,  రెడ్డి శ్రీనివాసరావు, కె. శ్రీకుమార్, ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పాల్గొని విద్యార్థులకు, పరిసర గ్రామ ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులకు అవగాహన కలుగజేయడం అంటే మొత్తం సమాజానికి అవగాహన కలుగచేయడమని, ప్రస్తుత కాలంలో వారే అసలైన సామాజిక కార్యకర్తలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. రాజశేఖర ఫణీంద్ర, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్స్ బి. సుధీర్, ఎ. ఫణిభాస్కర్, ఆర్.ఎస్.కె. సుప్రీత, తదితరులు పాల్గొన్నారు. 

ads