UPDATED 6th JULY 2018 FRIDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్ మెంట్ విభాగం ఎఎంజి ఇన్నోవేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా పరిశ్రమలు, విద్యాసంస్థలు పరస్పర అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యాసంస్థలు ఒకదానితో ఒకటి కలసి ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి నూతన పోకడలు ఆవిష్కరించుకోవచ్చని, ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇంజనీరింగ్ కళాశాలలు పరిశ్రమలతో కలిసి పరస్పర అవగాహన అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ రిలేషన్ ఎఎంజి ఇన్నోవేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అండ్ హెడ్ హ్యుమన్ రిసోర్స్ సత్య తోపల్లి, మేనేజర్ నాగేంద్ర గన్నవరపు హాజరై మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యాసంస్థలు పరస్పర అవగాహనతో నూతన ఆవిష్కరణలు జరిగి అన్ని రంగాలలో జాతీయ అభివృద్ధి, దానితో పాటు ఆర్థికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ ఎఎంజి మిని కాన్ క్లేవ్ ద్వారా బహుళజాతి సంస్థలు ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ఏఏ లక్షణాలు కావాలనే ఆసక్తికరమైన అంశాలను తెలిపారని పేర్కొన్నారు. కళాశాల ప్లేస్ మెంట్ ఆఫీసర్ యస్. వంశీకరణ్ మాట్లాడుతూ సుమారు 200 మంది ఆఖరి సంవత్సరం విద్యార్థులు అధ్యాపకులతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తమ విద్యార్థుల్లో స్పూర్తి నింపిన వక్తలకు తమ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎమ్.వి. హరనాధ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.