అన్నవరం దేవస్థానం ఈవోగా జితేంద్ర

UPDATED 7th DECDMBER 2017 THURSDAY 10:00 PM

అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం ఈవోగా మారిశెట్టి జితేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్‌ 8న ఈవోగా పనిచేసిన కాకర్ల నాగేశ్వరరావుకు  విజయనగరం జాయింట్ కలెక్టర్- 2గా బదిలీ కాగా, జూన్‌ 18న దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఈరంకి జగన్నాథరావుకు ఇన్‌ఛార్జి ఈవోగా బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి ఇన్‌ఛార్జి ఈవో పాలనలోనే ఉండగా ఎట్టకేలకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న జితేంద్రను అన్నవరం దేవస్థానం ఈవోగా బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ నుంచి ఈనెల 24న ఉత్తర్వులు వెలువడ్డాయి. దేవాదాయశాఖ నుంచి ఉత్తర్వులు గురువారం ఉదయం రావడంతో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్యదేవుడ్ని దర్శించుకున్న  వేదపండితులు ఆశీర్వచనం పొందారు. 

ads