ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్ష

UPDATED 5th MAY 2019 SUNDAY 8:00 PM

గండేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమీషన్ ఆధ్వర్యంలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్ లో ఆదివారం నిర్వహించిన గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ విద్యా సంస్థల ప్రాంగణంలో గల మూడు ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, బిజినెస్ కళాశాలల్లో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిత్య క్యాంపస్ లో 7345 మంది పరీక్షకు హాజరు కావలసిఉండగా 4027 మంది మాత్రమే హాజరైనారని, 3318 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పెద్దాపురం రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, గండేపల్లి మండల తహసీల్దార్ టి.ఎల్.ఎల్.ఎ.ఎస్. ప్రసాద్ పరీక్షా కేంద్రాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగ్గంపేట సిఐ వై. రాంబాబు, గండేపల్లి ఎస్ఐ తిరుపతిరావు, తదితర పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పరీక్ష వ్రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆదిత్య యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేశారు. 

ads