విద్యార్థినులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* శ్రీ ప్రకాష్ లో ఘనంగా ప్రారంభమైన సిబిఎస్ఇ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు 
* వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన 750 మంది క్రీడాకారులు

UPDATED 11th OCTOBER 2018 THURSDAY 9:00 PM

పెద్దాపురం: విద్యార్థినులు విద్యతో పాటు క్రీడల్లో కూడ రాణించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో ఐదు రోజులు పాటు నిర్వహించనున్న సిబిఎస్ఇ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ క్రీడల్లో ప్రావీణ్యత సంపాదించాలని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని బడ్జెట్ ను విడుదల చేసి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుందని చెప్పారు. గతంలో తల్లిదండ్రులు వారి పిల్లలకు క్రీడలపట్ల ప్రోత్సాహం ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, చాలామంది క్రీడల్లో రాణించి జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని తెలిపారు. ఈ రోజు నుంచి ఐదు రోజులపాటు జరిగే హ్యండ్ బాల్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 750 మంది విద్యార్థినులు పాల్గొనడం అభినందనీయమన్నారు. శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూలు యాజమాన్యం విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రథమంలో ఉంటుందని ఈ సందర్భంగా శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూలు డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ ను అభినందించారు. శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూలు డైరెక్టర్ సి హెచ్. విజయప్రకాష్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట అధిక ప్రాధాన్యం ఇస్తోందని, త్వరలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఓలెంపిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మంత్రి క్రీడాజ్యోతిని వెలిగించి కపోతాలను, బెలూన్స్ ను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, హ్యాండ్ బాల్ ఆసోసియేషన్ టెక్నికల్ బోర్డు చైర్మన్ కె. రమేష్, సివోవో కె. శ్రీనివాసరావు, లెఫ్ట్ నెంట్ కమాండర్ కె.ఎస్. రావు, వైస్ ప్రిన్సిపాల్ నీరా ప్రసాద్, లైజెన్ ఆఫీసర్ ఎం. సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads