సత్యదేవుడి కార్తీక ఆదాయం రూ.11.18 కోట్లు

అన్నవరం, 21 డిసెంబరు 2020 (రెడ్ బీ న్యూస్): సత్యదేవుడికి కార్తీక మాసం కానుకల వర్షం కురిపించింది. నెల రోజులకు అన్ని విభాగాల ద్వారా రూ.11,18,96,234 ఆదాయం లభించింది. గతేడాది కార్తీకమాసంలో వచ్చిన రూ.16.44 కోట్లతో పోలిస్తే కేవలం రూ 5.25 కోట్లు మాత్రమే తగ్గింది. గత ఏడాది వ్రతాల ద్వారా రూ.6.85 కోట్లు రాగా ఈసారి 3.62 కోట్లు లభించింది. ప్రసాదం విక్రయాల ద్వారా గతేడాది రూ.3.24 కోట్లు రాగా ఈ ఏడాది రూ.3.21 కోట్లు వచ్చింది. హుండీల ద్వారా గతంలో రూ.2.35 కోట్లు రాగా ఈసారి రూ.1.85 కోట్లు వచ్చాయి. టోల్‌గేట్ రుసుంతో నిరుడు రూ.13.44 లక్షలు సమకూరగా ఈ ఏడాది రూ.15.76 లక్షలు వసూలైంది. సత్రం గదుల అద్దెల ద్వారా గతేడాది రూ.72.72 లక్షలు కాగా ఈసారి రూ.70.9 లక్షలు సమకూరింది. ప్రత్యేక దర్శనాల ద్వారా గత కార్తీకంలో రూ.1.01 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది రూ.66.93 లక్షలు సమకూరింది. ఈ ఏడాది డార్మెటరీలను అద్దెకివ్వక పోవడంతో ఆ విభాగం నుంచి ఎటువంటి ఆదాయం లభించలేదు. రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో లేకపోవడంతో భక్తుల రాక తగ్గిందని, దీంతో ఆదాయంలో కోత పడినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us