వాడీవేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

UPDATED 7th SEPTEMBER 2018 FRIDAY 9:30 PM

సామర్లకోట: మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం వాడీవేడిగా జరిగింది. కౌన్సిలర్ రెడ్నం సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 10వ వార్డులో నీటి సమస్య మరీ ఎక్కువగా ఉందని అన్నారు. దీనికి సమాధానంగా డిఇ రామారావు మాట్లాడుతూ ఉదయం ఫిల్టర్ నీరు, సాయంత్రం బోరునీరు ఇస్తున్నామని అన్నారు. కౌన్సిలర్ కాళ్ళ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రంథాలయ సమస్యపై కౌన్సిల్ సమావేశంలో ఎన్నిసార్లు చెప్పినా సరే గ్రంథాలయానికి సొంత భవన నిర్మాణం ఇంతవరకు జరగలేదని  వృద్ధులు, దివ్యాంగులు రెండు అంతస్తులు ఎక్కి గ్రంథాలయానికి వెళ్లలేకపోతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీనియర్ మన్యం చంద్రరావు మాట్లాడుతూ అనేక కల్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలు, రోడ్లు వేశామని అలాగే గ్రంథాలయానికి నిధుల కొరత ఉన్న కారణంగా భవన నిర్మాణం జాప్యం జరుగుతుందని తొందరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ads