చెదరని సంకల్పం.. ఉరిమిన ఉత్సాహం

UPDATED 25th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: రైతు ఏ కాలంలో ఏ పంట వేస్తే పంట దిగుబడి అధికంగా వస్తుందో తెలుసుకొని పైరు వేసుకుంటారు. అలాగే రైతుకు ఎలా మేలు చేయాలో అలా రూపకల్పన చేయడం ఒక్క దివంగత నేత డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డికి మాత్రమే తెలుసని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3వేల కిలోమీటర్ల చేరుకున్న సందర్భంగా సంఘీభావంగా సుబ్బారావు నాయుడు సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం నుంచి మొదటి రోజు పాదయాత్రను ప్రారంభించి మేడపాడు వద్ద ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చరిత్రాత్మకమని, ఈ రికార్డును చెరిపే మరో నాయకుడు పుట్టరన్నారు. మిగిలిన రెండు జిల్లాల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయానికి దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, మద్దాల శ్రీను, సేపేని సురేష్, కర్రి వెంకటరమణ, మలకల వరహాలబాబు, మోరంపూడి శ్రీరంగనాయకులు, కంటే వీరరాఘవ, రమేష్ రెడ్డి, శెట్టిబత్తుల దుర్గ, పిళ్లా సురేష్, గోపు మురళి, నేతల హరిబాబు, గంగిరెడ్డి కృష్ణమూర్తి, చిట్టూరి లక్ష్మణరావు, ఎండి ఉబేదుల్లా, పుట్టా సూరిబాబు, వేగు సత్తిబాబు, అడబాల వీరభద్రరావు, చిట్టిమాని శ్రీను, పోతుల వీర్రాజు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ads